విద్యార్థుల గ్యాంగ్ ఫైట్.. సహచర విద్యార్థితో పాటు అతని తల్లిదండ్రులను చితకబాదిన స్టూడెంట్స్!

  • హైదరాబాద్ లోని సీతాఫల్ మండీలో ఘటన
  • పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు
సినిమాలు పిల్లలను ఎంతలా చెడగొడుతున్నాయో చెప్పడానికి పక్కా ఉదాహరణ ఇది. సినిమాల తరహాలో గ్యాంగ్ గా ఏర్పడ్డ ఓ స్కూలు విద్యార్థులు మరో గ్యాంగ్ కు చెందిన స్టూడెంట్ ను అతని ఇంటికి వెళ్లి మరీ చితక్కొట్టారు. అడ్డుగా వచ్చిన సదరు బాలుడి తల్లిదండ్రులను కూడా చితకబాదారు. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

హైదరాబాద్ లోని సీతాఫల్ మండికి చెందిన శ్రీవాస్తవ్ స్థానికంగా ఉన్న ఓ స్కూలులో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్లాసులోని విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి గొడవపడేవారు. అయితే నిన్న ఈ గొడవ కాస్తా ముదరడంతో శ్రీవాస్తవ్ ఇంటికి ఓ గ్యాంగ్ విద్యార్థులు వెళ్లారు.

అతడిపై కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. వీరిని అడ్డుకోబోయిన తల్లిదండ్రులను సైతం చితక్కొట్టారు. దీంతో బాధిత కుటుంబం చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Telangana
Hyderabad
strret fight
gang fight
school students
chilakalaguda police
cctv
10 th class students

More Telugu News